అందుకే నా మంత్రి పదవి కేసీఆర్ లాగేసుకున్నారు: ఈటల రాజేందర్
తెలంగాణలో అలజడి రేగింది. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కల్లోల్లాన్ని దగ్గరుండి చూసుకుంటూ ఎంతో పకడ్బంధీగా అణచి వేసేందుకు కృషి చేసిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంత్రి పదవిని సీఎం కేసీఆర్ లాగేసుకున్నారు. తాజాగా వైద్య ఆరోగ్యశాఖను మంత్రి ఈటల రాజేందర్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ తమిళిసై. అయితే తనను బాధ్యతల నుండి తప్పించడంపై ఈటల రాజేందర్ స్పందించారు.
అయితే… వేలాది కరోనా కేసులు వస్తున్న ఈ సమయంలో ప్రజలకు మెరుగైన చికిత్స అందేలా వైద్య ఆరోగ్య శాఖను సీఎం తన నుంచి తీసుకున్నారని స్పష్టం చేశారు. అలాగే ఏ శాఖని అయిన తీసుకొనే అధికారం… తప్పించే అధికారం సీఎంకి ఉందని ఆయన తెలిపారు. అలాగే శాఖ ఉన్నా, లేకున్నా వ్యక్తిగతంగా ప్రజలకి తాను సేవ చేస్తానని.. తనపై ప్రణాళిక బద్ధమైన కుట్ర జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా వంద ఎకరాలు ఆక్రమించి షేడ్లు వేశారని ఆరోపిస్తున్నారని.. అర ఏకరమా? వంద ఎకరాల?అనేది తెల్చాలని ఆయన అన్నారు. తాను కరోనా కేసులపైనే దృష్టి పెట్టానని.. పార్టీ పార్యకర్తలు, నేతలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఉన్నానని అన్నారు. కాగా తాను సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నించలేదు, ప్రయత్నించను కూడా అంటూ ఈటల రాజేందర్ వివరించారు.