హెచ్ సిఏ పరిణామాల పై అజారుద్ధీన్ తీవ్ర వ్యాఖ్యలు…

హైదరాబాద్ లోని క్రికెట్ అసోషియేషన్ హెచ్ సిఏ వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏకంగా 130 మంది క్లబ్ మెంబర్లు పాల్గొనడం విశేషం. అయితే ఇదే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అపెక్స్ కౌన్సిల్. అంబుడ్స్ మెన్ గా జస్టీస్ దీపక్ వర్మ నియామకం అయ్యారు. అలాగే ఈ అంబుడ్స్ మెన్ నియామక విషయంలో స్టేజీ మీదే గోడవపడ్డాడరు అజారుద్దీన్, విజయానంద్.
అదేవిధంగా ఆ తర్వాత అజారుద్దీన్ మాట్లాడుతూ… క్రికెట్ అభివృద్దే నా ద్యేయం అని చెప్పిన ఆయన జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం 20శాతం ఫండ్ కేటాయించారు. పాండిచేరి, ఆంద్రప్రదేశ్ లలో వలె తెలంగాణలోని అన్ని జిల్లాలో గ్రౌండ్ లని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా తాను ప్రెసిడెంట్ అయ్యాక పి.ఎఫ్., ఐటీ, జి.ఎస్.టీ, గ్రౌండ్ లీజ్ వంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసానని, కొంత మంది తమ స్వలాభం కోసం… తాను ఏమి చేస్తున్నా అడ్డుపడాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకా హెచ్సిఏలో జరుగుతున్న గోడవలపై బీసీసీఐ సీరియస్ గా ఉందని కూడా చెప్పిన ఆయన ఏజీఎంలో కావాలనే గొడవ చేసిన వారికి షోకాజ్ నోటీస్ లు ఇవ్వడంతో పాటు… అవసరమైతే సస్పెండ్ కూడా చేస్తామని అజారుద్దీన్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *