హుజూరాబాద్ పై కేసీఆర్ స్పెషల్ ఫోకస్….
తెలంగాణలో టీఆర్ఎస్ మాజీ ఎంపీ ఈటల రాజేంద్ర వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఇంకా పార్టీకి రాజీనామా చేయకుండానే అన్ని పార్టీల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ కు దూరం కాబోతున్న మాజీ మంత్రి ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ కావటంతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ హుజురాబాద్ విషయంపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అదేమంటే… హుజూరాబాద్ లో ఉపఎన్నిక తప్పదనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన గులాబీ పార్టీ.. పూర్తి పట్టు కోసం వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థే గెలిచేలా ఇప్పటికే నేతలు బాధ్యతలు తీసుకొని గ్రౌండ్ లెవల్ లో తమ పనిని మొదలుపెట్టేసినట్లు కూడా సమాచారం అందుతుంది. కాగా ఈటెల బీజేపీలోకి వెళ్లడం ఖాయం అవ్వడంతో అధికార పార్టీ నేతలు విమర్శల జోరు పెంచారు. తాజాగా ఈటలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈటల తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. పల్లా కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన డీకే అరుణ.. కేసీఆర్ మెప్పు కోసం పనిచేసే టీఆర్ఎస్ నేతలకు అసలు ఆత్మే లేదని, ఇక గౌరవం ఎక్కడనుంచి వస్తుందని ఆమె ఎద్దేవా చేశారు. కాగా మొత్తానికి హుజురాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని గట్టి వ్యూహమే రచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అంతేకాకుండా కేసీఆర్ వ్యూహాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు హైకమాండ్ ఆదేశాలను గ్రౌండ్ లెవల్లో లోకల్ లీడర్స్ ఆచరణలో పెడుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.