హుజూరాబాద్ అభివృద్ధి పై పెద్దిరెడ్డి షాకింగ్ కామెంట్స్….

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14వ తేదీన బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈటల టీఆర్ఎస్ పార్టీ మారినప్పటి నుంచి.. ఆయనపై టీఆర్ఎస్ నాయకులు మాటల దాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఈటల రాజేందర్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. దీంతో తాజాగా బీజేపీ నేత పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని… తాను చేసిన అభివృద్ధి కనబడుతుందని ఆయన వెల్లడించారు.
అదేవిధంగా ఇంకా ఆయన మాట్లాడుతూ… ఎన్నికలు ఇప్పుడే రావని.. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని వివరించారు. అంతేకాకుండా బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని… ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. అలాగే హైకమాండ్ ఆదేశిస్తే పోటీ చేస్తానని తెలిపిన ఆయన…. హుజురాబాద్ ను జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. కాగా 2014లో పోటీ చేస్తానని వచ్చానని.. అవకాశం రాలేదని అన్నారు. కాగా 2018లో పోటీ చేస్తానని వచ్చానని.. అలయెన్స్ లో కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయించారని దాంతో.. పోటీ చేయలేకపోయానని పెద్దిరెడ్డి వివరించారు.