హీరో విశ్వక్ సేన్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్…

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎ.ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ‘అక్టోబర్ 31 – లేడీస్ నైట్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు నలుగురు ప్రముఖ హీరోయిన్ లు మెయిన్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో నివేతా పేతురాజ్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్, మేఘా ఆకాశ్ లు ఉన్నారు. మరిక్కడ విశేషం ఏమిటంటే… ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం దర్శకుడు ఎ. ఎల్. విజయ్… టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. హాలోవిన్ నైట్ జరిగే కొన్ని ఊహించని పరిణామాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
అదేవిధంగా ప్రసుత్తం అందుకు సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్, విద్యుల్లేఖ రామన్ పై కీలక సన్నివేశాలను షూటింగ్ జరుపుతున్నారు. కాగా ఈ సినిమాని ఎఎల్ విజయ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం తీస్తున్నారు. అంతేకాకుండా ఆయన తెరకెక్కించిన ప్రముఖ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత బయోపిక్ ‘తలైవి’ రిలీజ్ కు రెడీగా ఉన్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *