హిజ్రాగా సోనాక్షి… తండ్రి కోరిక తీరినట్లే..!

బాలీవుడ్ షో-మ్యాన్ సంజయ్ లీలా బన్సాలీ మరో రొమాంటిక్, మ్యూజికల్, లవ్ సాగాకి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ‘హీరా మండి’ అనే సినిమా చేయనున్నాడు. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘పాకీజా’ నుంచీ ఈ సినిమా విషయంలో బన్సాలీ ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది.
అయితే హిందీ తెరపై హీరోయిన్లు నర్తకీమణులుగా, వేశ్యలుగా కనిపించబటం కొత్తేం కాదు. ‘పాకీజా, ఉమ్రావ్ జాన్’ లాంటి మైల్ స్టోన్ మూవీస్ లో అప్పటి తరం వారు ఆడిపాడి మురిపించిన విషయం తెలిసిందే. ‘దేవదాస్’లో చంద్రముఖిగా మాధురీ దీక్షిత్ కూడా ‘ముజ్రా’తో మోహంలో పడేసింది. ఉత్తరాదిలో సంపన్నులైన విటుల ముందు వేశ్యలు చేసే శాస్త్రీయ నృత్యాన్ని ముజ్రా అంటారు. అలాగే ఐశ్వర్య రాయ్ కూడా ‘ఉమ్రావ్ జాన్’ రీమేక్ లో అందమైన ముజ్రాలతో మైమరపించేసింది.
అదేవిధంగా ‘హీరా మండి’ సినిమాలో సంజయ్ బన్సాలీ కూడా ముజ్రా సంస్కృతిని చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హ్యుమా ఖురేషి ఓ నర్తకిగా ఎంపికైంది. మరో ముజ్రా డ్యాన్సర్ గా సోనాక్షి సిన్హాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బన్సాలీ ప్రొడక్షన్స్ లో సోనాక్షి ‘రౌడీ రాథోర్’ సినిమా చేసింది. అయితే సోనాక్షి కంటే ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా ‘హీరా మండి’ విషయంలో ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బన్సాలీ డైరెక్షన్లో సోనాక్షి ఒక్క సినిమా అన్నా చేయాలన్నది ఆయన కోరికని సమాచారం. అంతేకాకుండా ‘పాకీజా, ఉమ్రావ్ జాన్’ వంటి క్లాసిక్ మూవీస్ ఇన్ స్పిరేషన్ తో ‘హీరా మండి’ రూపొందిస్తున్నప్పటికీ సంజయ్ లీలా బన్సాలీ మల్టీ స్టారర్ లో పాటలు, నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయని సమాచారం. కాగా హ్యుమా, సోనాక్షి వంటి బాలీవుడ్ బ్యూటీస్ చేసే ముజ్రాలతో పాటూ మైమరిపించే సంగీతం ‘హీరా మండి’ని ఓ మథుర జ్ఞాపకం మారుస్తాయని ముంబై టాక్. చూద్దాం ఏం జరుగుతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *