హరిహర వీరమల్లు నిర్మాత అప్డేట్ ఇదే…
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ ‘హరిహర వీరమల్లు’ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కెరీర్లోనే భారీ సినిమా అవుతుందని ఎమ్ రత్నం తెలిపారు.
అయితే తాజాగా ఆయన హరిహర వీరమల్లు సినిమాపై కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ సినిమా కథ విన్నప్పుడే బడ్జెట్ అంచనా వేశానని, ఎంత ఖర్చు అయినా సరే తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇప్పటికే సినిమా షూటింగ్ సగం వరకు పూర్తి అయ్యిందని వివరించారు. ఏప్రిల్ మొదటి వారం వరకు షూటింగ్ జరుగుతుండగా.. పవన్ కరోనా బారిన పడటంతో షూటింగ్ నిలిచి పోయిందని అన్నారు. అలాగే లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే సినిమా షూటింగ్ పునః ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కాగా చెప్పిన సమయానికే ‘హరిహర వీరమల్లు’ సంక్రాంతికి వస్తుందని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమాతో పాటు ‘అయ్యప్పన్ కోషియుమ్’ రీమేక్ సినిమా షూటింగ్ కూడా ఒకేసారి జరుగుతాయని ఏఎమ్ రత్నం స్పష్టం చేయడం విశేషం.