స్టైలిష్ గా ఐకాన్ స్టార్ బర్త్ డే వేడుకలు

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా రూపాంతరం చెందుతున్న అల్లు అర్జున్ బర్త్ డే వేడుకలతో సొషల్ మీడియా హోరెత్తుతుంది. ఏప్రెల్ 8, బన్నీ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలా మంది అల్లు అర్జున్ కు విషెస్ చెప్పారు. అందరికంటే డిఫరెంట్ భార్యామణి స్నేహారెడ్డి, తమ్ముడు అల్లు శిరీశ్.
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అల్లు శిరీశ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ కేక్ పోస్ట్ చేశాడు. ఆ కేక్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందుకు కారణం ఏమిటంటే… ఆ కేక్ పై పలు సినిమాల టైటిల్స్ ఒరిజినల్ ఫాంట్ తో ఉండటమే. ‘అర్య’ మొదలు ‘పుష్ప’ వరకూ ఎన్నో మెమరబుల్ సినిమా టైటిల్స్ తో కేక్ అందరినీ ఆకట్టుకుంటుంది.
అలాగే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి కూడా ఓ కేక్ పిక్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ కేక్ పై ‘హ్యాపీ బర్త్ డే అర్జున్’ అన్న పదాలున్నాయి. వాటితో పాటూ చాక్లెట్ కోటింగ్ తో ఊరిస్తోన్న స్ట్రాబెరీస్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ స్టైలిష్ స్ట్రాబెరీ కేక్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంది.
అదేవిధంగా అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని అంటేలా అభిమానులు జరుపుకున్నారు. ఇది అల్లు అర్జున్ 38వ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బన్నీ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మరో విషయం వెలుగు చూస్తుంది. అదేమంటే.. ఈరోజు రాత్రి 8గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లోని దుర్గం చెరువు దగ్గర అల్లు అర్జున్ బర్త్ డే వేడుకలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా కేబుల్ బ్రిడ్జి పై లేజర్ లైట్స్ షోను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది అల్లు అర్జున్ బర్త్ డే వేడుకలను వైభోగంగా సెలెబ్రేట్ చేయనున్నారు. ఇక ‘పుష్ప’ టీజర్ సంచలనాలు సృష్టిస్తుండడంతో సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ నామస్మరణే వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *