స్టాలిన్ ప్రభుత్వంలో ఐదుగురు తెలుగువారు మంత్రులుగా…

తమిళనాడులో ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మొత్తం 34మంత్రులతో స్టాలిన్ కేబినెట్ ఏర్పడింది. ఇందులో తెలుగువారైన ఐదుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వరించడం విశేషం. తమిళ కేబినెట్ లో ప్రతిసారీ తెలుగు మంత్రులు స్థానం పొందుతూనే ఉన్నారు. సీఎం జయలలిత అయినా కరుణానిధి అయినా పన్నీర్ సెల్వం, పళనిస్వామి సీఎం ఎవరైనా సరే తెలుగువారికి మాత్రం అవకాశం వరిస్తూనే ఉంది.
ముఖ్యంగా తమిళనాడులో చెన్నైతో పాటు కోయంబత్తూరు, మదురైలో ఇప్పటికీ లక్షల్లో తెలుగువారు స్థిరపడి ఉన్నారు. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలను తెలుగువారే శాసిస్తారు. అందుకే అన్ని పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో తెలుగువారికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తుంటారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 15మంది తెలుగువారు వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అందులో ఐదుగురికి స్టాలిన్ మంత్రి పదవులు ఇచ్చిన గౌరవించడం విశేషం.
వారిలో వరుసగా….
కె కె ఎస్ ఎస్ రామచంద్రన్-అరుప్పుకొట్టై నియోజకవర్గం ఎమ్మెల్యే, రెవిన్యూ శాఖ మంత్రి.
ఏ వ వేలు – తిరువణ్ణామలై నియోజకవర్గం- పీడబ్లుడి శాఖ మంత్రి .
ఆర్ గాంధీ – రాణిపేట నియోజకవర్గం పీడబ్ల్యుడి- టెక్స్టైల్ శాఖ మంత్రి.
కె ఎన్ నెహ్రు – తిరుచ్చి వెస్ట్ -మున్సిపల్ శాఖ మంత్రి
పీ కె శేఖర్ బాబు – చెన్నై దురై ముగం- దేవాదాయ శాఖ మంత్రి పదవులు వరించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా గత పళని స్వామి కేబినెట్ లో కూడా కదంబురు రాజు, బాలకృష్ణారెడ్డి వంటి తెలుగువారు పదేళ్ళపాటు మంత్రులుగా పని చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *