స్టాలిన్ ను కలిసి సాయం అందించిన హీరో సూర్య కుటుంబం..

తమిళనాడులో కరోనా విలయ తాండవం చేస్తుంది. దీంతో స్టాలిన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చకచకా కరోనాపై యుద్ధం చేస్తూ తగు చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ఏర్పడటంతో పలువురు ప్రముఖులు వారిని కలిసి అభినందనలు తెలుపుతున్నారు. దీంతో పలువురు నటులు ముఖ్యమంత్రి స్టాలిన్ ను, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ను కలిసి అభిమానిస్తున్నారు. తాజాగా సూర్య తండ్రి శివకుమార్, సూర్య, కార్తీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి అభినందించారు. అంతేకాకుండా కోవిడ్-19పై చేస్తున్న ఈ పోరాటానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు సూర్య ఫ్యామిలీ ఒక కోటి విరాళం ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్య ఫ్యామిలీ చాటిన ఉదారతపై ప్రశంసల వర్షం కురుస్తుంది. కాగా డిఎం.కె పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్ ఈ మధ్యనే తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. స్టాలిన్ తనయుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.