సైలెంట్ గా ప్రముఖ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్….
ఓ హీరోయిన్ ప్రముఖ డైరెక్టర్ ను పెళ్ళాడి తన అభిమానులకు షాకిచ్చింది. ఆమే బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్. ‘ఉరిఃది సర్జికల్ స్ట్రైక్’తో భారీ హిట్ ను అందుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్, యామి గౌతమ్ పెళ్లితో ఒక్కటయ్యారు. తమ పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటిస్తూ పెళ్లి ఫోటోలు షేర్ చేశారు.
అయితే వీరి పెళ్లి వేడుక కరోనా కారణంగా అత్యంత్య సన్నిహితులు, ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్టు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే… ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ‘ఉరి’ సినిమాలో యామి గౌతమ్ కూడా నటించింది. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. కాగా ఆదిత్య-యామి తాజాగా పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఇప్పుడు యామి-ఆదిత్య పెళ్లి పిక్స్ చూసిన ప్రముఖులు, వారి అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా యామి గౌతమ్ తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాల్లో నటించింది. కానీ ఏది ఏమైనా ఈ బ్యూటీకి ఓ ఫేస్ క్రీం యాడ్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
Type a message