సూపర్ నేచురల్ ఫాంటసీగా సందీప్ కిషన్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలు చేసుంటూ వెళ్తుంటారు. సనిమాకు సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తుంటారు. అయితే ఈ రోజు సందీప్ కిషన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సందీప్ మరో సినిమా ఓకే చేశాడు. సందీప్ కిషన్ కెరీర్లో ఇది 28వ సినిమా కావడం విశేషం.
అయితే ఈ సినిమాకు గతంలో సందీప్ తో ‘టైగర్’ వంటి వెరైటీ సినిమా తీసిన వీఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. పుట్టినరోజు సినిమా ప్రకటనతో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. సూపర్ నేచురల్ ఫాంటసీగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వెల్లడించారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా బాలాజీ గుట్ట సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కరోనా తగ్గగానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది అంటూ వివరించారు.