సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు

దేశంలో రోజు రోజుకీ కరోనా తీవ్రంగా వ్యాపిస్తుంది. కరోనా మహమ్మారి ఎలా విజృంభిస్తోంది అంటే ప్రతి రోజూ లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే ప్రధాని మోడీ ఆధ్వర్యంలోనే అత్యున్నతస్థాయి మీటింగ్ జరిగింది. ఈ సమావేశం తర్వాత కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా కేంద్రం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కాగా 12 వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. పరీక్షలపై ఉన్నత విద్యాశాఖ అధికారులతో ప్రధాని మోడీ సమీక్షా సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈరోజు ఒక్కరోజే దేశంలో 1.85 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, 1026 మరణాలు నమోదు కావడంతో ముందు ముందు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది ఆందోళన కలిగించే అంశంగా మారింది. అంతేకాకుండా విద్యార్థులకు కరోనా చాలా వేగంగా సోకుతుండటంతో కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొనేందుకు దారి తీసింది.