సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన… సర్వత్రా ఉత్కంఠ…

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో ఈ మధ్య ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా జగన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. అలాగే కరోనా విలయ తాండవం వంటి పలు అంశాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి.
అదేవిధంగా వైఎస్ జగన్ ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. అమిత్ షాతో పాటు ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ పర్యటనలో పోలవరం నిధులు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై సీఎం జగన్ చర్చిం చనున్నారు. అంతేకాకుండా ప్రధాని అపాయింట్ ను కూడా సిఎం జగన్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వ్యాక్సినేషన్ విషయంలో సీఎం జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాయటం, రఘురామ ఎపిసోడ్ వంటి విషయాల నేపధ్యంలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.