సీఎం జగన్ కు ఆర్ఆర్ఆర్ మరో లేఖాస్త్రం…..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి… వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఇప్పటికే వరుస లేఖలతో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న రఘురామకృష్ణరాజు… ఈ సారి మరో సమస్యను తన లేఖలో లేవనెత్తారు. నవ ప్రభుత్వాల కర్తవ్యాల పేరుతో ఈసారి రఘురామ లేఖ రాశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షల రద్దుపై ఈనెల 1వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు.
అదేవిధంగా కరోనా బారీ నుంచి పిల్లలను కాపాడేందుకే ప్రధాని నిర్ణయం తీసుకున్నారని… అయితే అన్ని రాష్ట్రాలు కూడా బోర్డు పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయని ఆయన అందులో పేర్కొన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనా టైంలోనూ పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఉందని ఆయన మండిపడ్డారు. కాగా విద్యార్థులను ఒత్తిడికి గురిచేయకుండా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని… ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారని కూడా లేఖలో రఘురామకృష్ణరాజు వివరించారు.