సీఎం అంటే ఆయనలా ఉండాలి: కోమటిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నకిరేకల్ మున్సిపాల్టీలో ఈరోజు ఆయన ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగనే అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వెయ్యి రూపాయలు దాటిన వైద్యం అంతా ఆరోగ్య శ్రీలోనే అన్నారని.. కరోనా ట్రీట్ మెంట్ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారంటూ ప్రశంసించారు.
అదేవిధంగా కరోనా వైరస్ బారినపడి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలు తగలేస్తున్నారని.. మరి తెలంగాణలో కరోనా ట్రీట్మెంట్ను ఎందుకు ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవడం లేదంటూ సీఎం కేసీఆర్పై కోమటిరెడ్డి మండిపడ్డారు. అలాగే ఓటు వేసే ముందు… నీ కొడుక్కి ఉద్యోగం వచ్చిందా..? మీకు ఇళ్లు వచ్చాయా? లేదా? అనేది ఆలోచించి ఓటు వేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏపీ సీఎం వైఎస్ జగన్పై కోమటిరెడ్డి ప్రశంసలు కురిపించడం అనే విషయం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది.