సిగ్గుందా విష్ణు నీకు : హీరో సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ఈ సమయంలో పార్టీల మధ్య, నేతల మధ్య, సెలబ్స్ మధ్య తీవ్రమైన మాటల దాడి రాజుకుంటుంది. అయితే ఇది అంతా కరోనాను ఆశ్రయించే కావడం ఆశ్చర్యమేస్తుంది.
అయితే ఈ మధ్య కాలంలో బిజేపి నాయకులపై హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ సందేశాలు వచ్చాయని, అంతేకాకుండా అత్యాచారం బెదిరింపులు కూడా వచ్చాయని హీరో సిద్దార్థ్ పోలీసులకు రిపోర్ట్ చేశారు. దీంతో తమిళనాడు బిజేపి, ఈ హీరో సిద్ధార్ధ్ కు మధ్య వార్ అప్ వర్డ్స్ చోటు చేసుకున్నాయి. ఈ వివాదం కాస్త దేశ వ్యాప్తంగా వివాదాస్పదమైంది. అటు తేజస్వి సూర్యను కూడా సిద్దార్థ్ టార్గెట్ చేశాడు. తేజస్వి సూర్యను టెర్రరిస్ట్ తో పోల్చాడు సిద్దార్థ్. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ బిజేపి లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి సిద్దార్థ్ కు చురకలు అంటించారు.
విష్ణు వర్థన్ రెడ్డి ఏమన్నారు అంటే… సిద్దార్థ్ సినిమాలకు దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు కౌంటర్ గా విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలకు హీరో సిద్దార్థ్ ట్విటర్ ద్వారానే జవాబిచ్చారు. తాను అసలైన భారతీయున్ని అని, సక్రమంగా పన్ను కడుతున్నానని.. వెళ్ళి పడుకో విష్ణు… ఇలాంటి మాటలు మాట్లాడేందుకు సిగ్గుండాలి విష్ణు అంటూ కౌంటర్ ఇచ్చాడు సిద్దార్థ్. అసలు సిద్ధార్థ్ ఏమన్నారంటే.. ‘దావూద్ నా టిడిఎస్ చెల్లించడానికి సిద్ధంగా లేడు. నేను పరిపూర్ణ పౌరుడిని, పన్ను చెల్లింపుదారున్ని విష్ణు. వెళ్ళి పడుకో. బిజెపి రాష్ట్ర కార్యదర్శి అంటా. సిగ్గుండాలి.’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.