సింగర్ మంగ్లీపై కేసు నమోదు….
తెలంగాణలో బోనాల సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే బోనాల పాటలు అన్ని చోట్లా అదరగొడుతున్నాయి. ప్రతీ పండుగకు ఓ పాట విడుదల చేసినట్టే.. ఈ సారి కూడా ఓ పాటను వదిలారు సింగర్ మంగ్లీ. అయితే, పాటలోని కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.
అదేమంటే… బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారంటూ మంగ్లీపై రాచకొండ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని పేర్కొన్న నేతలు.. తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి పాటను తొలగించాలని కోరారు. కాగా సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేయాలని సీపీని కోరారు బీజేపీ కార్పొరేటర్లు.