సాహో డైరెక్టర్ తో కన్నడ హీరో సుదీప్ మూవీ…!
ఇంటర్నేషన్ స్థాయి సినిమా అంటూ ప్రభాస్ తో సుజిత్ చేసిన సినిమా సాహో. ఈ సినిమా రిలీజై అట్టర్ ప్లాప్ గా నిలించింది. దీంతో అభిమానులకు సుజిత్ క్షమాపణలు చెప్పాడు. అయితే ఈ డైరెక్టర్ తాజాగా కన్నడ స్టార్ హీరో సుదీప్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. శాండిల్వుడ్ వర్గాలు చెప్తున్న విషయాన్ని బట్టి చూస్తే తాజాగా బెంగళూరు వెళ్లి సుదీప్కు డైరెక్టర్ సుజిత్ ఓ స్టోరీ చెప్పి వచ్చారని టాక్ నడుస్తోంది. అయితే ఈ స్టోరీ లైన్ సుదీప్కు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్తో రావాల్సిందిగా సుజిత్ను కోరినట్లు సమాచారం. మరి వీరిద్దరి కాంబోలో సినిమా ఎంతవరకు పట్టాలెక్కుతుంది అనేది వేచి చూడాలి.
కాగా తెలుగులో సుజిత్ శర్వానంద్తో ‘రన్ రాజా రన్’, ప్రభాస్తో ‘సాహో’ సినిమాలు చేశారు. ‘సాహో’ తర్వాత సుజిత్ ఓ హిందీ సినిమా చేయబోతున్నారనే టాక్ వచ్చినా అది ఆ తర్వాత టాక్స్ ఏం లేవు. మరి ఇప్పడు సుదీప్ తో సుజిత్ చేస్తున్నది అలాంటి బాలీవుడ్ సినిమా స్థాయి వంటిదేనా? మరేదైనానా? మరి బాలీవుడ్ లో కీలక పాత్రకోసం సుదీప్ కు స్టోరీ చెప్పారా? వింటి విషయాలు తెలియాల్సి ఉంది.