సాయిపల్లవి నామ సంవత్సరంగా 2021..?

2020లో వెండితెరపై అంతగా కనిపించని సాయిపల్లవి 2021 మాత్రం తనదేలా అగుపిస్తుంది. 2020లో కేవలం ఒకే ఒక ఆంథాలజీతో ఓటీటీలో ప్రేక్షకులను అలరించిన ఈ డాన్సింగ్ వండర్ ఈ సంవత్సరం మాత్రం పూర్తిగా మెరవనుంది. నాగచైతన్యతో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరితో వచ్చేనెల 16న తెలుగువారి ముందుకు రాబోతుంది ఈ ముద్దుగుమ్మ.
అంతేకాకుండా ఏప్రిల్ నెలాఖరులో రానాతో వేణు ఉడుగుల తీస్తున్న విరాటపర్వంతో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే లవ్ స్టోరి పాటలతో, విరాటపర్వం టీజర్ తో తన పవర్ ఏమిటో చూపించిన సాయి సోషల్ మీడియానే హీటెక్కించేస్తుంది. అసలు సాయిపల్లవి ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి తనే పెద్ద ప్లస్ అన్నట్లుగా మంచి పర్ఫామెన్స్ ఉంటుంది. లవ్ స్టోరీనే తీసుకుంటే సారంగ దరియా సాంగ్ తో వచ్చిన హైప్ క్రెడిట్ సాయిపల్లవిదే అని చెప్పాలి. ఎక్కడ చూసినా సాయిపల్లవి డ్యాన్సింగ్ విన్యాసాలే. ఇక విరాఠపర్వం టీజర్ లోనూ సాయిపల్లవి మాస్ ట్రీట్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఈ రెండు సినిమాల తర్వాత నాని ‘శ్యామ్ సింగ్ రాయ్’లోనూ సాయిపల్లవి క్యారక్టర్ హైలైట్ కాబోతుంది. అలాగే పవన్, రానా నటిస్తున్న మలయాళ రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లో కూడా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమాలో పాత్ర చిన్నదైనా తనదైన ముద్ర వేయటం ఖాయంగా మారింది. దీంతో ఈ సంవత్సరం మొత్తం సాయిపల్లవి ప్రేక్షకుల మతులు పోగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *