సాయిపల్లవితో వరుణ్ తేజ్ పెళ్లి పై నాగబాబు క్లారిటీ…
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ కుటుంబంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పలు రకాల చర్చలకు దారితీస్తుంది. మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్ళి అయ్యాక ఇక అందరి దృష్టి వరుణ్ తేజ్ పైనే పడింది.
అయితే తాజాగా వరుణ్ తేజ్ పెళ్ళిపై పలు రకాలుగా రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు వరుణ్ పెళ్లిపై ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య నాగబాబు ఇన్స్ట్రాగ్రామ్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించారు. ఆ సమయంలో ఓ నెటిజన్ ‘వరుణ్ తేజ్ సాయి పల్లవి జోడి బాగుంటుంది… వాళ్ళిద్దరికీ మ్యారేజ్ చేస్తారా సార్?’ అని కామెంట్ చేశాడు. దానిపై స్పందించిన నాగబాబు ఆ నెటిజన్ కు సమాధానంగా జాతిరత్నాలు సినిమాలోని క్లైమాక్స్లో వచ్చే కోర్టు సీన్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో జడ్జ్ గా ఉన్న బ్రహ్మానందం ‘తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా. ఇక నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే’ అనే డైలాగ్ ఉంటుంది. దీంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ గా మారింది.
అదేవిధంగా నాగబాబు ఇప్పటికే వరుణ్ తేజ్ పెళ్లిపై అనేకసార్లు స్పందించాడు. ఇంకా వరుణ్ కు మంచి అమ్మాయిని చూడమంటూ మెగా అభిమానులకు కూడా సూచించాడు. వరుణ్ తేజ్ ఇప్పుడే పెళ్లి వద్దని అంటున్నాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా నాగబాబు చెప్పాడు. అప్పటి నుంచి వరుణ్ ఓ హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడనే రూమర్లు కూడా విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిని మెగా కుటుంబం తేలికగానే కొట్టపడేస్తుంది. మరి నిజంగా వరుణ్ తేజ్ ఆ అమ్మాయితో లవ్ లో ఉన్నాడంటారా? లేకా ఇది రూమరేనా? అన్న విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.