సల్మాన్ బాటలో విద్యాబాలన్….

బాలీవుడ్ స్టార్స్ కి కరోనా మంచి పాఠాలనే నేర్పుతున్నాయని చెప్పవచ్చు. గత సంవత్సరం మొదటిసారి లాక్ డౌన్ లో అక్షయ్ కుమార్ తో పాటు ఎంతో మంది స్టార్స్ తమ సినిమాలతో ఓటీటీ ప్లాట్ ఫాంపైకి వచ్చారు. లాభనష్టాలు ఎలా ఉన్నా థియేటర్లు లేకపోవటంతో ఇంటర్నెట్ ద్వారా ఇంట్లో చూపించడమే మంచిదని బాలీవుడ్ భావించింది. అయితే 2020 అటు ఉంచితే.. 2021లో కూడా కరోనా ఇంకా షాక్ ఇస్తూనే ఉంది. దీంతో బాలీవుడ్ లో ఓటీటీ మెయిన్ ఫ్లాట్ ఫాం అయిపోయింది. బాలీవుడ్ లోని స్టార్ హీరో సల్మాన్ ఖాన్… ఆన్లైన్ లోకి వచ్చేశాడు. ‘రాధే’ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి సల్మాన్ వంటి మాస్ హీరోనే కరోనా ఎఫెక్ట్ తో మాస్క్ వేసుకుని ఓటీటీకి వచ్చేస్తే… విద్యా బాలన్ విషయం ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆమె కూడా మరోసారి అమేజాన్ ప్రైమ్ బాట పట్టడం విశేషం.
గత ఏడాది ‘శకుంతలా దేవీ’ సినిమాతో ఆన్ లైన్ లో సందడి చేసిన మన వెర్సటైల్ యాక్ట్రెస్ విద్యా బాలన్.. ఇప్పుడు ఏకంగా అమేజాన్ ద్వారా అభిమానుల్ని అలరించబోతుంది. ‘షేర్నీ’ సినిమా ప్రైమ్ లో వచ్చేస్తోందంటూ విద్యా స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. జూన్ లో రావచ్చు అంటూ హింట్ ఇచ్చింది. మొత్తానికి విద్యా బాలన్ ఫ్యాన్స్ వచ్చే నెలలోనే ఆమె నటించిన ‘షేర్నీ’ సినిమాను ఇంట్లోంచే చూడవచ్చు అన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *