సర్కారు వారి పాట లీక్స్ పై మహేష్ అసహనం….

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘సర్కారు వారి పాట’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో అత్యధిక భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఈ మధ్యనే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసింది. అయితే మహేష్ బాబు సినిమాకి కూడా ఇప్పుడు లీకుల బాధ తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలోని కొన్ని సెట్ వర్క్ పిక్స్, కీ స్నాప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అయితే ఇదే సమయంలో మహేష్ చెప్పిన డైలాగ్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో సినిమా యూనిట్ సినిమాకు సంబంధించిన ఎలాంటి లీకులు బయటకు రావద్దని, సస్పెన్స్ కంటిన్యూ చేయాలని టీం మొత్తాన్నీ అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కాగా మహేష్ కూడా ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. సినిమా కథ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచారు కాబట్టి ఈ లీకులు ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని తగ్గించేస్తాయని ఆయనగా భావిస్తున్నారట. అలాగే ప్రొడక్షన్ హౌస్ సెట్స్ లో జాగ్రత్తగా ఉండాలని, అలాగే కఠినంగా ఉండాలని మహేష్ హెచ్చరించారని కూడా తెలుస్తోంది. మరి ఇప్పటికైనా లీకులు ఆగుతాయా? కంటిన్యూ అవుతాయా? అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *