సరిహద్దుల వద్ద వెహికల్స్ నిలిపివేత… ప్రయాణికుల కష్టాలు….

కరోనా లాక్ డౌన కారణంగా తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెట్టింది. అలా అయితేనే కరోనాను కట్టడి చేయగలమని చెప్తుంది. అయితే తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షల్లో భాగంగా సరిహద్దుల వద్ద భారీస్థాయిలో ప్రైవేటు వాహనాల నిలిపివేత కొనసాగుతుంది. దీంతో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు లాక్డౌన్ ను తెలంగాణ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుంది.
అయితే సరిహద్దుల వద్ద ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్ప్లాజా వద్ద ప్రైవేట్ వాహనాలను భారీగా నిలిపివేశారు. ఈ పాస్ ఉంటేనే వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులు, కార్లు భారీస్థాయిలో నిలిచిపోయాయి. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అత్యవసర సరుకు, అంబులెన్స్ లకు మాత్రమే పాస్లు లేకున్నా అనుమతిస్తున్నారు. కానీ ప్రైవేటు వాహనాలు మాత్రం ఈ పాస్ తప్పనిసరి చేసింది. మరి ఏం జరుగుతుంది అనేది తెలంగాణ-ఏపీ సరిహద్దుల వద్ద ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *