సన్సార్ పూర్తి చేసుకున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత తెరకెక్కిన సినిమా ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ ‘పింక్’ రీమేక్గా ఈ సినిమాని తెరకెక్కించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బోనీకపూర్ సమర్పణలో దిల్రాజు నిర్మించారు.
అయితే అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రచారంలో దూసుకుపోతుంది. ఇందులో పవన్ న్యాయవాదిగా కనిపించనున్నారు. తాజాగా ‘వకీల్సాబ్’ సెన్సార్ పూర్తి చేసుకుని, యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సెన్సార్ టాక్ అయితే వకీల్ సాబ్కు చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల వెల్లడిస్తున్నాయి. కాగా ‘పింక్’ సినిమాలో దాదాపుగా ఫైట్స్ ఉండవు కానీ ‘వకీల్ సాబ్’లో మొత్తం 5 యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఈ వకీల్ సాబ్ సినిమాలో డైరెక్టర్ చేసిన మార్పులు తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు ఆగాల్సిందే. చూద్దాం….