షూటింగ్ లో పాల్గొన్న కృతి శెట్టి……

టాలీవుడ్ లో ‘ఉప్పెన’ సినిమా ఓ సంచనం. అలాంటి ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. ఈ సినిమా సక్సెస్ తో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.
అదేవిధంగా కరోనా లాక్ డౌన్ తర్వాత కృతి పాప షూటింగ్ లో జాయిన్ అయింది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ ‘అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. అయితే ఈరోజు కృతిశెట్టి షూటింగులో జాయిన్ అయినట్లు సమాచారం అందుతుంది. లవ్ అండ్ రొమాంటిక్ గా వస్తున్న ఈ సినిమా ఇదివరకు విడుదల చేసిన టైటిల్, ప్రోమో ఆసక్తిని రేపింది. కృతి ఈ సినిమాతో పాటుగా రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహించనున్న సినిమాలో కూడా త్వరలోనే జాయిన్ కానుంది. అయితే నానితో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తున్న విషయం తెలిసిందే.