షూటింగ్ కు రెడీ అవుతోన్న నితిన్….
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి షూటింగ్ కు రెడీ అవుతున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘మాస్ట్రో’. హిందీ సినిమా ‘అంధాధూన్’కు ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే రాజ్ కుమార్ ఆకెళ్ళ దీనికి సమర్పకుడుగా ఉన్నారు. మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమన్నా కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేశ్ నటిస్తోంది.
అదేవిధంగా ఈ సినిమాలో జిష్షుసేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. తాజాగా ఈ సినిమాపై అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఇందులో తొలిసారిగా నితిన్ అంధుడిగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫైనల్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో జరగనుంది. ఇందులో కీలక సన్నివేశాలు షూటింగ్ జరుపుకోనుంది. కరోనా కారణంగా గత రెండు నెలలుగా సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా కష్ట పరిస్థితుల కారణంగా చాలా సినిమాల థియేట్రికల్ రిలీజ్ లు వాయిదా పడ్డాయి. ఇలాంటి సమయంలో హీరో నితిన్ కరోనాకు వ్యతిరేకంగా ధైర్యం చేసి షూటింగ్ ను రీస్టార్ట్ చేయడం విశేషమనే చెప్పాలి.