షాక్ లో మేడారం…. ప్రముఖ పూజారి మృతి…

తెలంగాణలోని ములుగు జిల్లాలో ఘోరం జరిగింది. ఈ మధ్య కరోనా కోరల్లో సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎంతోమంది చిక్కుకుంటున్నారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ధాటికి ఎన్నో దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయ తాండవం చేస్తుంది.
అయితే ఇప్పటికే ఈ కరోనా వైరస్ తో రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. ఈ వైరస్ ఎవరినీ వదలడం లేదని చెప్పవచ్చు. తాజాగా ప్రసిద్ది గాంచిన మేడారం శోకసంద్రంగా మారింది. అదేమంటే.. ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం గ్రామంలో సమ్మక్క తల్లి పూజారి సిద్దబోయిన సమ్మారావు మృతి చెందారు. అయితే సమ్మారావుకు ఒక నెల క్రితం కరోనా సోకింది. కరోనా నుండి కోలుకున్న తర్వాత అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ ఆ పూజారి తుదిశ్వాస విడిచారు. కాగా గత కొద్దిరోజుల క్రితం సమ్మారావు భార్య సృజన కరోనాతో మృతి చెందింది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ఇప్పుడు సమ్మారావు కూడా కరోనాతో మృతి చెందడంతో పిల్లలు అనాధలుగా మారారు. దీంతో మేడారం గ్రామమంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగింది.