షాకింగ్ టైం… టీ-బీజేపీతో జనసేన మళ్లీ పొత్త…!
జనసేన పార్టీ పూటకో పార్టీతో గంటకో సిద్ధాంతంతో పోటీపడుతూ దోస్తీ కడుతుండటం విచిత్రం అనిపిస్తుంది. ముఖ్యంగా మొన్నటికి మొన్న తెలంగాణ బీజేపీ నాయకులు తమను సంప్రదించడం లేదని అలిగి మరీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్ తాజాగా తిరిగి బీజేపీతో దీస్తీ కట్టేందుకు రెడీ అయ్యారు.
అయితే జనసేన-భారతీయ జనతా పార్టీ మధ్య ఏపీలో పొత్తు ఉన్నా.. తెలంగాణలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసిన జనసేన.. ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం.. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం తటస్థంగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఖమ్మం వేదికగా.. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు చిగురించింది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 12 డివిజన్లలో బీజేపీ, 10 డివిజన్లలో జనసేన అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ఆ రకంగా సంప్రదింపులు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. కాగా ఎక్కడెక్కడి నుంచి ఏ పార్టీ అభ్యర్థి బరిలోకి దిగాలి అనే విషయంపై ఇరు పార్టీలు త్వరలోనే నిర్ణయం తీసుకుంటాయని కూడా చెప్తున్నారు. తెలంగాణలో బీజేపీ నేతల వ్యవహార శైలిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎమ్మెల్సీ ఎన్నికల సమయం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. మరి తెలంగాణ బీజేపీకి- జనసేనకి మధ్య పొత్తు ఇలాగే స్థిరంగా ఉటుందా? లేకా మళ్లీ విడాకులు వంటివి ఉంటాయా? అనేది ఆసక్తిని రేకెత్తించే అంశాలే.