షాకింగ్: ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్…..
ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను నిలుపుదల చేస్తూ బ్రేక్ వేసింది హైకోర్టు. 8వ తేదీ ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదే సమయంలో.. పరిషత్ ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు.
అయితే కోడ్ అమలు చేయడంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను పాటించలేదనే సూచనలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరిషత్ ఎన్నికల నిర్వహణను సవాల్ చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు.. హైకోర్టును ఆశ్రయించాయి. బీజేపీ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు.. టీడీపీ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. కాగా.. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది కూడాను. ఈ సమయంలో హైకోర్టు స్టే ఇవ్వడంతో.. ఇప్పుడు ఏం జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 8వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా రాష్ట్రప్రజానీకం అవాక్కయింది. ఈ కేసులో ఈ నెల 15వ తేదీన అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించింది హైకోర్టు. దీంతో.. పరిషత్ ఎన్నికల విచారణ 15కు వాయిదా వేస్తూ ఎన్నికలకు స్టే విధించింది.