షర్మిలకు ఆ హక్కు ఉంది… బీజేపీ స్టేట్ ఇన్చార్జ్
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తాజాగా సంకల్ప సభ సాక్షిగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ షర్మిల పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జునుడు నడియాడిన నేలను టిఆర్ఎస్ అపవిత్రం చేస్తుందని అన్నారు. అలాగే సాగర్ లో టిఆర్ఎస్ లెగ్, పెగ్ సంస్కృతి తీసుకు వస్తుందని అన్నారు.
అంతేకాకుండా డబ్బుతో, మద్యంతో ప్రజలను టిఆర్ఎస్ మభ్యపెట్టాలని చూస్తుందని, సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తోందని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ కేసులో 4గురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు వార్తలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఓట్లు వేస్తే డ్రగ్స్ తీసుకుంటారా? తెలంగాణ ప్రజాలకు ఎలాంటి సంకేతాలు ఇస్తారు? అంటీ ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం కూడా రేవ్ పార్టీలు చేస్తుందని, రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల జీవితాలతో అడుకుంటున్నారని అన్నారు. చివరగా షర్మిల కొత్త పార్టీపై స్పందిస్తూ ఎవరైనా కొత్త పార్టీలు పెట్టుకోవచ్చని, షర్మిలకు కూడా కొత్త పార్టీ పెట్టుకొనే హక్కు ఉందని తరుణ్ చుగ్ వివరించారు.