శ్రీదేవి సోడా సెంటర్ గ్లింప్స్ వైరల్…
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ నుంచి గ్లింప్స్ కట్ ను రిలీజ్ చేసింది సినీ యూనిట్. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఎంతో ఆసక్తిని రేపేలా ఉంది.
ముఖ్యంగా ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ నేటివిటీ మిస్ కాకుండా చూపించాడనే టాక్ నడుస్తోంది. అలాగే లైటింగ్ సూరిబాబు రోల్ లో సుధీర్ బాబు సరి కొత్తగా షార్ప్ గా కనిపిస్తున్నాడు. పల్లెటూరి యువకుడిగా కనిపిస్తూ మ్యాచో బాడీతో అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. కాగా మణిశర్మ నేపథ్య సంగీతం మరింతగా ఆకట్టుకునేలా సాగింది. అయితే ఈ సినిమాని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇంకా హీరోయిన్ ఎవరన్నది వెల్లడి చేయకపోవడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.