శ్రీకారం నిర్మాతలకు శర్వానంద్ లీగల్ నోటీసులు….

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమా నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను బి.కిషోర్ డైరెక్టర్ చేశారు. అలాగే ఈ సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలను అంతగా అందుకోలేక పోయింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
అయితే ఈ సినిమాకి గాను ముందుగా 6 కోట్ల రెమ్యూనరేషన్ తో 50% లాభం తీసుకునేట్టుగా నిర్మాతలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు శర్వానంద్. కానీ సినిమా విడుదలకు ముందే అతనికి నాలుగు కోట్ల రూపాయలు చెల్లించారు. మిగిలిన రెండు కోట్ల రూపాయలకు పోస్ట్-డేటెడ్ చెక్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో శర్వానంద్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇక విషయంపై ‘శ్రీకారం’ నిర్మాతలు, శర్వాతో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకుంటారా? లేకా లీగల్ గానే ముందుకు వెళ్తారా? అనేది వేచి చూడాలి.