వ్యాక్సిన్ తీసుకున్న మోడీ.. ఏ కంపెనీ అంటే…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. అయితే గతంలో తాను మాట్లాడుతూ.. రెండో విడత ప్రారంభ సమయంలో తప్పకుండా తాను వ్యాక్సిన్ తీసుకుంటానని వెల్లడించారు. మోడీ చెప్పినట్లుగానే రెండో విడతలో తొలి డోస్ ను తీసుకున్నారు. అయితే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకోవాలని మోడీ సూచించారు కూడా.


కాగా దేశంలో ఇప్పటి వరకు రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్, మరొకటి భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్. ఈ రెండు రకాల వ్యాక్సిన్లను దేశంలోని ప్రజలకు ప్రభుత్వం అందిస్తుంది. ప్రధాని మోడీ మాత్రం ఇండియాలో సొంత పరిజ్ఞానంతో భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తీసుకోవడం విశేషం.
అయితే ఈ విషయాన్ని ఎయిమ్స్ సంస్థ తెలియజేసింది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను ప్రధానికి ఇచ్చామని, 28 రోజుల్లో రెండో డోస్ కూడా ఇస్తామని మోడీకి వ్యాక్సిన్ అందించిన నర్స్ పి నివేద స్పష్టం చేశారు. మొత్తానికి మోడీ కూడా వ్యాక్సినేషన్ వేసుకున్నారన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *