వ్యాక్సినేషన్ పై మోడీకి నోబెల్ : చిదంబరం

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ నుంచి ప్రపంచదేశాలన్నీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కరోనా వ్యాక్సిన్ ముమ్మరంగా వేస్తుండటం, కరోనా కూడా కాస్త తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా వ్యాక్సినేషన్లో జూన్ 21వ తేదీన ఇండియా ప్రపంచ రికార్డ్ను సృష్టించింది. ఉచిత టీకాలను ప్రతిపాదించిన తొలిరోజే ఇండియాలో 88లక్షల మందికి టీకాలు వేయడం ఆ రికార్డ్ నెలకొల్పింది. అయితే ఆ తర్వాత రెండో రోజు ఆ సంఖ్య 54 లక్షలకు పడిపోయింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. మోడీ ఉంటే ఇలాంటి అద్భుతాలు సాధ్యమే అని, బహుశా ఈ రికార్డ్ కు నోబెల్ బహుమతి ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఇంకా ఆయన మాట్లాడుతూ ఆదివారం రోజు వ్యాక్సిన్లను కూడబెట్టి వాటిని సోమవారం రోజున వేశారని, మంగళవారం రోజున యధావిధిగా ఇబ్బందులు ఎదురయ్యాయయని అన్నారు. అలాగే ప్రపంచరికార్డ్ వెనుక ఉన్న ఆంతర్యం ఇదేనని చిదంబరం రహస్యం వెల్లడించారు. మొత్తానికి ఈ విమర్శలను బీజేపీ తిప్పికొడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ఆలస్యం కారణంగానే ఆ మరుసటి రోజున వ్యాక్సినేషన్ తగ్గిందని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. చూద్దాం చిదంబరం వ్యాఖ్యలు మరెన్ని మలుపులు తిరుగుతాయో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *