వ్యవసాయం చేస్తున్న రష్మిక
టాలీవుడ్ లో మంచి ఇమేజ్ తో టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది నటీమణి రష్మిక మందన. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా గడుపుతుంది. మిషన్ మజ్ను సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది రష్మిక. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్రోల్ పోషిస్తున్నాడు.
అలాగే తమిళంలో కార్తీ సరసన సుల్తాన్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక పల్లెటూరి యువతి పాత్రలో మెరవనుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో షేర్ చేసింది రష్మిక. ఇందులో వ్యవసాయం చేస్తున్న రష్మిక పొలాన్ని.. దుక్కి దున్నేందుకు బురదలోకి దిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఏప్రిల్ 2న ‘సుల్తాన్’ థియేటర్ లో రిలీజ్ కానుంది. అంతాకాకుండా రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.