వైరల్: థియేటర్స్ ఎప్పుడు ఓపన్ అవుతాయంటే…!

కరోనాతో దేశం అల్లాడిపోయింది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం సినిమా పరిశ్రమపై భారీగా పడింది. దీంతో థియేటర్లు మూత పడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కోవిడ్-19 సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా విజృంభించడంతో ఏప్రిల్ రెండవ వారం నుంచి తెలంగాణలో థియేటర్లు మూతబడ్డాయి. థియేటర్లు మూతబడి ఇప్పటికి రెండు నెలలు అవుతోంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ థియేటర్లు తెరుచుకునే అవకాశం కన్పిస్తోంది.
అయితే తెలంగాణలో జూన్ 19 వరకు లాక్ డౌన్ నిబంధనలు కొనసాగనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ రాత్రి కర్ఫ్యూ మాత్రం మరో వారంరోజులు లేదా నెల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జూలై 1 నుండి థియేటర్లను తిరిగి తెరవడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా కేవలం యాభై శాతం సీటింగ్ సామర్థ్యంతో మాత్రమే థియేటర్లను ఓపెన్ చేయాలని ఆదేశాలను జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం. కాగా తొలి వేవ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లను యాభై శాతం సామర్థ్యంతో రీఓపెన్ చేయడానికి అనుమతించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దశల వారీగా పూర్తి ఆంక్షలు ఎత్తివేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ తగ్గినా థర్డ్ వేవ్ భయంతో ముందుగానే థియేటర్లలో యాభై శాతం సీటింగ్ సామర్థ్యాన్ని అనుమతిస్తారని సమాచారం. అంతేకాకుండా పబ్బులు, జిమ్లకు కూడా ప్రభుత్వం అనుమతించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.