వైఎస్ వివేకాది రూ. 8కోట్ల సుపారీ హత్య..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీమంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పురోగతి సాధించింది. ఏకధాటిగా 45రోజుల నుంచి వరుస విచారణలో కొన్ని కీలకమైన ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
అదేమంటే… ఈ కేసులో సుదీర్ఘ విచారణ కొనసాగిస్తున్న సీబీఐ.. వివేకానందరెడ్డి ఇంటి వాచ్మెన్ రంగయ్య నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం అందుతుంది. అలాగే రంగయ్య తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించినట్లు కూడా సమాచారం. అదేవిధంగా వివేకా హత్యకు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు తెలిపిన ఆయన.. ఈ హత్యలో తొమ్మిది మంది పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి ఇంటికి ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చారని తెలిపిన రంగయ్య.. హత్యలో ఇద్దరు ప్రముఖు వ్యక్తుల హస్తం ఉందని కూడా సంచలన విషయాలు బయట పెట్టారు. కాగా ఆ ప్రముఖులు ఎవరనేదానిపై పూర్తి విచారణ చేపడతామని సీబీఐ వెల్లడిస్తుంది. మొత్తంగా రంగయ్య వాంగ్మూలం ఈ కేసులో అత్యంత కీలకంగా మారడం అన్ని పార్టీల నేతలను, ప్రజలకు కేసుపై ఉత్కంఠ రేకెత్తిస్తుంది.