వెండితెరపై ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ బయోపిక్..!
సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఇండియాలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల జీవితాలు బయోపిక్స్ గా ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు తొలిసారి ఆధ్యాత్మిక గురువు జీవితం తెరకెక్కబోతుంది.
అయితే తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ బయోపిక్ కోసం నడుం బిగించారు. రవిశంకర్ జన్మదిన సందర్భంగా ఈ మూవీ ప్రకటించారు.
అదేవిదంగా అందుకు సంబంధించి కరణ్ ట్వీట్ చేస్తూ ‘గురుదేవ్ రవిశంకర్ బయోపిక్ ద్వారా జనాలలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలనేది మా లక్ష్యం. ఈ సినిమాను 21 భాషలలో దాదాపు 100 దేశాల్లో విడుదల చేయాలనుకుంటున్నామని అన్నారు. ‘ఫ్రీ’ ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు మాంటో బస్సీ దర్శకత్వం వహించనున్నారు. సన్ డైల్ ప్రొడక్షన్ పతాకంపై నీతు జైన్, ప్రేమ శుభాస్కరన్ నిర్మిస్తున్నారు. కాగా నటాషా ఓస్వాల్ సహనిర్మాత. అయితే కరోనా తగ్గగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం అందుతుంది.