విశాఖ ఉక్కుపై కేంద్రం మరోసారి క్లారిటీ…!
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించ వద్దని కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. ఇప్పటికే కార్మికులు ప్రకటించారు కూడా. అందులో భాగంగానే విశాఖలో ర్యాలీలు, నిరసన దీక్షలు పెద్ద ఎత్తున ఊపందుకున్నాయి.
అదేవిధంగా ఎవరెన్ని చెప్పినా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే రాజ్యసభలో ఇదే విషయాన్ని కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి ఓ ప్వశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే ఈరోజు కూడా పార్లమెంట్లో మరోసారి స్పష్టంగా చెప్పడంతో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అనివార్యమని తేలిపోయినట్లు అయింది. అంతేకాకుండా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వ్యతిరేకతను తెలియజేసింది. వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు చేస్తున్నారు. దిగిరాకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కూడా ప్రకటించారు. కాగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరంచడం వలన ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని కేంద్రం వెల్లడిస్తుంది. మరి ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.