విరుష్క జోడీపై ఫ్యాన్స్ గుర్రు

విరుష్క జంట పై ఫ్యాన్స్ ఓ రకంగా కినుక వహించారు. అదేమంటే.. ఇంగ్లండ్ తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం ఇండియన్ క్రీడాకారులు పూణె వెళ్లారు. వారితో కలిసి కోహ్లీ కూడా పుణెకు వెళ్లాడు. అతడితో పాటు అనుష్క కూడా వెళ్లింది. అయితే అనుష్క తమ గారాలపట్టి వామికను ఎత్తుకుని వెళుతోంది. వెనక కోహ్లీ లగేజీ తీసుకొని వెళ్తున్నాడు.
అయితే అంతా అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇదే సమయంలో వామిక ముఖం కనిపించకుండా అనుష్క దాచిపెట్టింది. దీంతో అభిమానులు కోహ్లీ-అనుష్కలపై సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వామికాను చూపించ వచ్చుగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు గుప్పిస్తున్నారు. కాగా విరుష్క జోడికి ఈ ఏడాది జనవరిలో పాప జన్మించిన విషయం తెలిసిందే. అయితే తమ పాపను ఇప్పటివరకు అభిమానులకు చూపించని విషయం తెలిసిందే. దీంతో అభిమానుల ఆగ్రహానికి ఈ జోడీ గురౌతుంది అనడంలో అర్థం లేకపోలేదు.