వరుస ఆఫర్లతో చిన్నారి పెళ్లికూతురు….

టాలీవుడ్ లో ఉయ్యాల జంపాల సినిమాతో మంచి ఊపు మీదున్న బ్యూటీ అవికా గోర్ ఆ తర్వాత గ్యాప్ తీసుకుంది. సహజంగా అవికా బుల్లితెర మీద సూపర్ ఫేమస్. ‘చిన్నారి పెళ్లికూతురు’గా హిందీలోనే కాకుండా.. తెలుగులో కూడా డైలీ సీరియల్ తో జనానికి సుపరిచితురాలు. టాలీవుడ్ లో‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్ గా మారింది క్యూట్ బ్యూటీ. ఫస్ట్ మూవీలోనే మంచి మార్కులు కొట్టేసింది, బాక్సాఫీస్ వద్ద మంచి రేంజ్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తుందిలే అనుకున్నారు అంతా… కానీ.. అక్కడే దెబ్బకొట్టేసింది.. అవికా తొలి విజయం తర్వాత టాలీవుడ్ పై అంతగా దృష్టిపెట్టలేదు. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్న వాడా’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నా బిజీ హీరోయిన్ కాలేకపోయింది.
అదేవిధంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తొలికోతలల్లో ఉన్న డిమాండ్ అవికా గోర్ కి ఇప్పుడు దొరకడం లేదు. అందుకు కారణాలు లేకపోలేదు. ఎంతో కొత్త అందాలు ఇండస్ట్రీలోకి రావడం, అలా పాత అందాలు దూరం కావడం అంతా పరిశ్రమలో మామూలే. అయితే ప్రస్తుతం తిరిగి మళ్లీ అవికా సినిమాల వేటలో పడింది. కానీ ఇప్పుడు కాస్త స్లోగానే సాగుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం ఆమమె నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తుంది. అంతేకాకుండా ఆదిసాయికుమార్ హీరోగా రూపొందే ‘అమరన్’ సినిమాలో కూడా అవికా గోరే హీరోయిన్. మరి అవికా గోర్ టాలీవుడ్ లో మంచి బిజీ హీరోయిన్ కావాలంటే వీటిల్లో ఏదో ఒకటి మంచి హిట్ కొట్టక తప్పని పరిస్థితి. మొత్తానికి అందుకోసం అవికా చాలా బాగా కష్టపడుతుందని టాక్ . మరి జరుగుతుందో చూడాలి.