వరసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్
బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. మార్చిలోనూ వరుస సెలవులు, సమ్మెలతో ఎక్కువ రోజులే బ్యాంకులు మూతబడిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల ఆరంభంలోనూ కూడా సెలవులు వస్తున్నాయి. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు, బ్యాంకు లావాదేవీలు ఎక్కువగా చేసేవారు అప్రమత్తంగా ఉండాల్సిన టైం వచ్చింది. ఏప్రిల్ నెలలో మొత్తంగా ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు 9 రోజులపాటు సెలవులను ఆర్బీఐ ప్రకటించింది. ఈ వారంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈరోజు నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నాలుగురోజుల పాటు వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.
ముఖ్యంగా దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా బ్యాంకులకు ఈ నాలుగు రోజులపాటు వరుస సెలవులు ఇస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఏప్రిల్ 13వ తేదీన తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది, గుధి పడ్వా, నంగమాపంబ మొదటి నవరాత్రి, బైశాఖి సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 14వతేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, తమిళ కొత్త సంవత్సరం, విషు, బిజు ఫెస్టివల్, బోహాడ్ బిహు పండుగల సందర్భంగా సెలవు. ఏప్రిల్ 15వతేదీన హిమాచల్ దినోత్సవం, బెంగాల్ కొత్త సంవత్సరం, బోహాగ్ బిహు, సార్హుల్ పండుగల సందర్భంగా సెలవు. ఇక ఏప్రిల్ 16వతేదీన బొహాగ్ బిహు పండగ సందర్భంగా సెలవు ప్రకటించారు. కాగా ఆ పండుగలను బట్టి.. సంబంధిత ప్రాంతాల్లో సెలవు ప్రకటించింది ఆర్బీఐ. ఈ నెల 21, 24 తేదీల్లో రామనవమి, రెండో శనివారం సందర్భంగా రెండు రోజుల పాటు బ్యాంకులకు సెలవు.