లోకేశ్ ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరింది : అనిల్ కుమార్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన హాట్ హాట్ గా సాగుతుంది. దీంతో ఏపీ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. అయితే కేసుల నుంచి తప్పించుకొనేందుకే సిఎం జగన్ ఢిల్లీ వెళుతున్నారని టీడీపీ విమర్శలు చేసింది. ఇదే సమయంలో ఏపీ మంత్రులు వరసుగా మీడియా సమావేశాలు నిర్వహించి ధీటుగా బదులిస్తున్నారు. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ అమోల్ బేబీ అయితే… లోకేష్ హెరిటేజ్ దున్నపోతా? అంటూ మండిపడ్డారు. భాష మాకు కూడా వచ్చని హెచ్చరించారు మంత్రి అనిల్ కుమార్.
అదేవిధంగా ఇంకా ఆయన మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు రక్తంలో ఉంటాయని…నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదని అన్నారు. దేశ ప్రజలు ఇప్పటికే పప్పు నాయుడు అని పేరు పెట్టారని.. ఈ రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్ కు పని అయిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే కరోనా కాలంలో కూడా పోలవరం పనులు ప్రణాళికాబద్ధంగా చేస్తున్నామని.. వైఎస్ బీజం వేసిన ప్రాజెక్టును ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తుంటే.. టీడీపీ నాయకులు చూడలేక పోతున్నారని విరుచుకు పడ్డారు. అంతేకాకుండా ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. లోకేష్ ఫ్రస్టేషన్ పీక్స్ లో ఉందని.. ఎమ్మెల్యేగా గెలవలేకపోయా అనే ఆందోళన ఆయనలో కనబడుతుందని అన్నారు. ముఖ్యమంత్రిని తిట్టి పెద్ద నాయకుడిని అయిపోయానని ఫీలవుతున్నాడని చురకలు అంటించారు మంత్రి అనిల్ కుమార్. డిపాజిట్ కూడా తెచ్చుకోలేని లోకేష్ కు జగన్ గురించి మాట్లాడే స్థాయి ఉందా? అంటూ లోకేశ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *