లోకేశ్ ఓ ఎర్రినాయుడు అంటూ ఆదిమూలపు సురేష్ ధ్వజం….
ఆంధ్రప్రదేస్ లో జగన్ ప్రభుత్వానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 48 గంటల డెడ్లైన్ పెట్టారు. టెన్త్ పరీక్షలు రద్దు చేస్తారా? లేక వాయిదా వేస్తారా? అనేది ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. అమరావతిలో డిజిటల్ టౌన్హాల్ సమావేశం నిర్వహించిన లోకేష్.. వర్చువల్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు లోకేశ్.
ముఖ్యంగా జగన్ మొండి వైఖరితో విద్యార్థుల జీవితాలకు పరీక్ష పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా లోకేష్ ట్వీట్ లో ముఖ్యమంత్రిపై మాట్లాడిన తీరు ఆక్షేపణీయమని ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఇప్పటికే ఒక విద్యా సంవత్సరం కోల్పోయిన విద్యార్థులకు ఏ రకంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే… లోకేష్ కు అర్థం కాదని ఆయన విరుచుపడ్డారు. లోకేష్ ట్వీట్ చూస్తే అతన్ని ఎర్రి నాయుడు అంటారని పేర్కొన్నారు. ఎవరో ఫీజులు కడితే… మరొకరు పరీక్షలు రాస్తే… స్టాన్ ఫోర్డ్ డిగ్రీ అని చెప్పుకుంటున్నాడు లోకేష్. విద్యార్థుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా లోకేష్ వ్యవహరించటం సిగ్గు చేటని ఆయన వివరించారు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో వకీల్ సాబ్ షోల సంఖ్య పెంచాలని వకాల్తా పుచ్చుకున్నప్పుడు కరోనా గుర్తుకు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. గత రెండేళ్ల నుంచి విద్యా రంగానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను లోకేష్ తెలుసుకుంటే మంచిదని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.