లొకేషన్ లో రకుల్ హోలీ హంగామా

టాలీవుడ్ లో అనతి కాలంలోనే అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటీమణి రకుల్ ప్రీత్ సింగ్, తెలుగులో గ్యాప్ వచ్చినా… బాలీవుడ్ లో ఫుల్ బిజీయై పోయింది ఈ పంజాబీ బ్యూటీ. తాజాగా వైష్ణవ్ తేజ్ తో క్రిష్ సినిమా ‘కొండపొలం’ ను పూర్తి చేసిన రకుల్ తమిళ సినిమా అయలాన్ కూడా పూర్తి చేసేసింది. ఏలియన్ టైప్ లో సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ అమ్మడు నటించిన బాలీవుడ్ మూవీ ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి కూడా సిద్ధమైంది. ఇదిలా ఉండగా మరో మూడు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతుంది రకుల్ భామ. వాటితో పాటు ఆగిన ‘ఇండియన్ 2’ సినిమా కూడా పూర్తి చేయాలి, కాగా బాలీవుడ్ సినిమాలు ‘అటాక్, మేడే, థ్యాంక్ గాడ్’ షూటింగ్ లో ఉన్న రకుల్ హోళీ రోజున ‘మేడే’ షూటింగ్ లొకేషన్ నుంచి హోళీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. హోళీ పండగలాగే తన కెరీర్ కూడా కలర్ ఫుల్ గా సాగుతోందని చెప్పుకొచ్చింది ఈ భామామణి. ఇప్పుడు ఈ వీడియోను నెట్టింట్లో తెగ వైరల్ అయిపోయింది. మళ్లీ రకుల్ తెలుగులో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటూ కామెంట్స్ గుప్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *