‘లెఫ్టినెంట్ రామ్’ హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్…
మాలీవుడ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ రొమాంటిక్ వార్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ‘లెఫ్టినెంట్ రామ్’ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నారు. సినీ యూనిట్ తాజాగా ఈ వార్ డ్రామాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి పేరును వెల్లడించారు. ఆమె మరెవరో కాదు మృణాల్ ఠాకూర్. తాజాగా మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ ప్రేయసిగా ఈ సినిమాలో ఆమె సీత పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ లో మృణాల్ చాలా అందంగా మెరవనుంది. ఆమె దుల్కర్ సల్మాన్ కళ్ళలోకి సూటిగా చూస్తోన్న పిక్ వైరల్ గా మారింది. కాగా దుల్కర్, మృణాల్ జంటగా నటిస్తున్న తొలి సినిమా ఇదే.
అదేవిధంగా మృణాల్ ఠాకూర్ చివరిసారిగా ‘తూఫాన్’లో కనిపించారు. ఇందులో ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో మృణాల్ అనన్య పాత్రలో నటించింది. ఆమె హిందీ, మరాఠీ సినిమాలలో కూడా బిజీగా మారింది. కాగా టెలివిజన్ సీరియల్స్ ద్వారా ముఖ్యంగా ‘కుంకుమ్ భాగ్య’లో బుల్బుల్ గా బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అలాగే 2019లో ఠాకూర్ యాక్షన్ థ్రిల్లర్ ‘బాట్లా హౌస్’ లో మృణాల్ కన్పించిన విషయం తెలిసిందే.