లాస్ట్ మినిట్ లో యడియూరప్ప ట్విస్ట్… ఉద్యోగులకు స్వీట్ న్యూస్…

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రేపేమాపో కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. అలాగే మరోవైపు.. యడియూరప్ప రాజీనామా చేసిన సమయంలో.. కొత్త సీఎంను ఎన్నుకొనేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిందిగా గవర్నర్ కోరారు.

అయితే ఈ చివరినిమిషంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పారు యడియూరప్ప. ఉద్యోగుల డీఏను 10.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల మూలవేతనంలో డీఏ 21.50 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కర్నాటకలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వారి మూలవేతనంలో 11.25 శాతంగా ఉంది. ఇప్పుడు ఏకంగా 21.50కు చేరింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

కాగా ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 4.5 లక్షల మంది పెన్షనర్లతో పాటు వివిధ పీఎస్యూలు, కార్పొరేషన్లలో పనిచేసే దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అయితే ఈరోజు రాత్రి 7 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించనుంది అధిష్టానం. ఇప్పటికే పరిశీలకులుగా కేంద్రమంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్రెడ్డిని నియమించగా వారు బెంగుళూరు చేరుకొని సంప్రదింపులు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *