లాక్ డౌన్ లవర్ తో శృతి… పిక్స్ వైరల్…

విశ్వనటుడు కమల్ హాసన్ వలెనే శృతి వెరైటీ లైఫ్ ను లీడ్ చేస్తుంటుంది. తనకు నచ్చింది.. తాను మెచ్చిన పని మాత్రమే చేస్తుంటుంది. అందుకే తాను చాలా ప్రత్యేకమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ శృతి హాసన్ లాక్ డౌన్ ను ప్రియుడితో ఎంజాయ్ చేసేస్తోంది. ప్రముఖ ఆర్టిస్ట్ శాంతను హాజరికతో కలిసి ఉన్న పిక్స్ ను షేర్ చేసింది శృతి. అయితే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించలేదు కానీ పిక్స్ ద్వారా వీరిద్దరి మనసులు మాత్రం ఒక్కొక్కటి కలిసిపోతున్నట్లుగా తెలిసిపోతుంది. ఆ విషయాన్ని శృతి ఫ్యాన్స్ కు ఒక్కొక్కటిగా ఎక్కించేందుకు ఇప్పటినుంచే ట్రై చేస్తున్నట్లు.. అలాంటి ప్రయత్నాలు ఏదో చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వారు షేర్ చేసే ఫోటోలు చూసి జనాలు అలా ఫిక్స్ అయిపోతారని వాళ్లు భావించే ఇలా పిక్స్ షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో శాంతను మాట్లాడుతూ… వృత్తిపరంగా తాము మంచి స్నేహితులమని, మా ఇద్దరి అభిప్రాయాలు చాలా కలకలిసిపోయాయని చెప్పుకొచ్చాడు. అయితే వ్యక్తిగత విషయాలు చర్చించాలనుకోవట్లేదని వారిద్దిరి ప్రేమకు సంబంధించిన ప్రశ్నలపై సమాధానాన్ని దాటవేశారు. అప్పటి నుంచి వీరిద్దరూ లవ్ లో ఉన్నారనే టాక్ సర్వత్రా వినిపిస్తుంది. ఇక విషయానికొస్తే… తాజాగా శాంతనుతో కలిసి శృతి షేర్ చేసిన పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. చివరగా నా బెస్టీతో లాక్డౌన్లో ఇలా… అంటూ శృతి పిక్స్ ను షేర్ చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *