లవ్ స్టోరీ రిలీజ్ అప్పుడే.. మేకర్స్ క్లారిటీ…!

టాలీవుడ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘లవ్ స్టోరీ’. అయితే ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా విడుదలపై ఇప్పటికే పలు రకాల ఊహాగానాలు వినిపించాయి. ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ తో ఆ డేట్ మిస్ అయింది. దీంతో లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో ఈ నెల చివరికి తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే లవ్ స్టోరీ విడుదల విషయంలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ముఖ్యంగా ‘లవ్ స్టోరీ’ నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ తాజా ఇంటర్వ్యూలో సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతనే ‘లవ్ స్టోరీ’ థియేటర్లలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ‘థియేటర్లలో రోజుకు 3 ప్రదర్శనలకు మాత్రమే అనుమతిస్తే… అలాంటప్పుడు తాము ‘లవ్ స్టోరీ’ని రిలీజ్ చేయాలని భావించడం లేదని వివరించారు. కాగా నైట్ కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేసి తిరిగి సాధారణ స్థితికి వచ్చిన తర్వాతనే తిరిగి ‘లవ్ స్టోరీ’ని విడుదల చేయడంపై ఆలోచిస్తామని అన్నారు. అయితే జూలై రెండవ వారం తర్వాత మాత్రమే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయని.. అదే జరిగితే ఆ తర్వాతనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని సునీల్ నారంగ్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *